Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో మంచు విష్ణు కుమార్తెలు.. ‘నా మనవరాళ్లు..’ అంటూ మోహ‌న్ బాబు పోస్టు..

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ తెర‌కెక్కుతోంది.

Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో మంచు విష్ణు కుమార్తెలు.. ‘నా మనవరాళ్లు..’ అంటూ మోహ‌న్ బాబు పోస్టు..

Manchu Vishnu daughters Ariaana Viviana looks in Kannappa

Updated On : December 2, 2024 / 12:11 PM IST

Kannappa : మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ తెర‌కెక్కుతోంది. ముఖేష్‌కుమార్‌ సింగ్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీలో మంచు ఫ్యామిలీ మొత్తం న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాలు న‌టిస్తున్న విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

వారిపుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని వారి లుక్‌ను తండ్రి మంచు విష్ణు సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ‘నా కుమార్తెలు క‌న్న‌ప్ప‌లో న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని మీతో పంచుకుంటున్న‌ప్పుడు నా హృద‌యం గ‌ర్వంతో ఉప్పొంగుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ మాయాజాలం చూసే వ‌ర‌కు నేను వేచి ఉండ‌లేను. నా కుమార్తెలు అద్భుతంగా న‌టించారు. హ్యాపీ బ‌ర్త్‌డే అరి,వివి. నేను మిమ్మ‌ల్ని ఎంతో ప్రేమిస్తున్నాను.’ అని మంచు విష్ణు రాసుకొచ్చాడు.

Silk Smitha : సిల్క్ స్మిత – క్వీన్ అఫ్ ది సౌత్.. బయోపిక్ గ్లింప్స్ చూసారా..

అటు న‌టుడు మోహ‌న్ బాబు సైతం వీరిద్ద‌రి ఫోటోను షేర్ చేశారు. ‘నా మ‌న‌వ‌రాళ్లు క‌న్న‌ప్ప మూవీతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. న‌ట‌న‌పై వాళ్ల‌కు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గ‌ర్వంగా ఉంది. వారికి మంచి గుర్తింపు రావాల‌ని, ఎంతో మందిలో స్ఫూర్తి నింపాల‌ని కోరుకుంటున్నాను.’ అని మోహ‌న్ బాబు అన్నారు.

Sobhita Shivanna : పెళ్ళైన ఏడాదిలోనే ఆత్మహత్య చేసుకున్న నటి శోభిత.. ఆమె గురించి తెలుసా..

ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.