Silk Smitha : సిల్క్ స్మిత – క్వీన్ అఫ్ ది సౌత్.. బయోపిక్ గ్లింప్స్ చూసారా..

ఇవాళ సిల్క్ స్మిత బర్త్ డే కావడంతో ఆ బయోపిక్ కి సంబందించిన ఓ చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.

Silk Smitha : సిల్క్ స్మిత – క్వీన్ అఫ్ ది సౌత్.. బయోపిక్ గ్లింప్స్ చూసారా..

Silk Smitha Queen Of The South Biopic Announcement Glimpses

Updated On : December 2, 2024 / 1:48 PM IST

Silk Smitha : అలనాటి నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ నటి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో కూడా వరుస సినిమాలు చేసింది. అక్కడి ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. దాదాపుగా ఆమె 15 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె ఐదు భాషల్లో కలిపి మొత్తం 450 సినిమాలు చేశారు.

Also Read : Sobhita Shivanna : పెళ్ళైన ఏడాదిలోనే ఆత్మహత్య చేసుకున్న నటి శోభిత.. ఆమె గురించి తెలుసా..

ఈ సందర్బంగా సిల్క్ స్మిత బయోపిక్ తీస్తున్నారు. నేడు ఆమె బర్త్ డే కావడంతో ఆ బయోపిక్ కి సంబందించిన ఓ చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ బయోపిక్ కి జయరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చంద్రిక రవి నటి సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుంది. ఈమె ఇప్పటికే పలు సినిమాలు చేసింది. ఇప్పటికే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

ఇక గతంలో కూడా సిల్క్ స్మితకి సంబందించిన ఓ సినిమా వచ్చింది.  డర్టీ పిక్చర్ అనే టైటిల్ తో 2011లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. దాని గ్లింప్స్ చూసుకుంటే.. అచ్చం సిల్క్ స్మితలా డ్రెస్సింగ్ తో కార్ లో నుండి దిగి నడుచుకుంటూ.. వచ్చింది చంద్రిక రవి. అలా ఆమె నడుచుకుంటూ వస్తున్నప్పుడు మగవారు ఆమెని చూసి ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగారు. అలా గ్లింప్స్ వీడియో సాగింది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

డి.