konaseema : వార్నీ ఎంత ప‌ని జేస్తివి.. యూట్యూబ‌ర్ అత్యుత్సాహం.. బంగారం కోసం గోతులు తవ్విన విద్యార్థులు..

గోల్డ్ హంట్ పేరుతో.. మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకూ ఉద్దేశం ఏంటో తెలిసినా..

Youtuber Gold Hunt People Dug Holes In The Whole Ground

సోషల్‌మీడియా అనేది ఎవరు ఎలా వాడితే అలా పనికి వస్తుందన్నది అందరికీ తెలిసినదే. ఐతే కొందరు యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ హోల్డర్లు తమకి వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకుని..అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మందపాటి ఆదిత్య అనే యువకుడు చేసిన పనికి కేసు నమోదైంది

స్థానిక మల్లవంతన దగ్గర్లోని స్టేడియంలో బంగారం, వెండి దాచానంటూ వీడియోలో చెప్పి వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డాడు. ఫలితంగా స్టేడియం కాస్తా గోతుల పాలైంది..ఏకంగా వందగోతులు దాకా తవ్వారంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

గోల్డ్ హంట్ పేరుతో.. మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకూ ఉద్దేశం ఏంటో తెలిసినా.. జనం కూడా వాటి కోసం కక్కుర్తిగా ఇలా ప్రవర్తించడం కూడా విమర్శల పాలయ్యేదే. ఇక్కడ దొరికే బంగారంతో తాత్కాలికంగా ప్రయోజనం పొందొచ్చేమో కానీ..ఇలా క్రీడల నిర్వహణ కోసం నిర్మించిన స్టేడియాన్ని ధ్వంసం చేయడాన్ని ఎవరూ సమర్థించరు. స్టేడియం సిబ్బంది కంప్లైంట్‌తో కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసారు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా ఇష్టం వచ్చినట్లు రీల్స్.. వీడియోలు చేసేవారికేం కొదవ ఉండదు. కానీ అందులోని ప్రమాదం గురించి..జరిగే నష్టం గురించి ఆలోచించకుండా..వేలంవెర్రిగా ముందుకు దూసుకుపోతేనే ప్రమాదం. తాజాగా అమలాపురంలో జరిగిన ఈ ఉదంతం దానికే నిదర్శనంగా మారింది.