YS Jagan: మేదరమెట్లకు వైఎస్ జగన్, షర్మిల

ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు రానున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఆమె అంత్యక్రియల్లో జగన్, షర్మిల పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొననున్నారు. మేదరమెట్లకు తాడేపల్లి నుంచి జగన్ హెలికాఫ్టర్లో రానున్నారు. యర్రం పిచ్చమ్మ మృతితో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు. మేదరమెట్లలో యర్రం పిచ్చమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి జగన్, షర్మిల నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను వారు పరామర్శిస్తారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో యర్రం పిచ్చమ్మ కన్నుమూశారు. ఆమె మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Also Read: మీరూ సునీతా విలియమ్స్‌లా అదరగొట్టేయాలనుకుంటున్నారా? నాసాలో ఇలా ఉద్యోగం సంపాదించుకోవచ్చు..