Sunita Williams: మీరూ సునీత విలియమ్స్‌లా అదరగొట్టేయాలనుకుంటున్నారా? నాసాలో ఇలా ఉద్యోగం సంపాదించుకోవచ్చు..
నాసా ఉద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను వాడుకోండి.

నాసాలో ఉద్యోగం సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. సునీత విలియమ్స్‌లా వ్యోమగామి కావాలని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలని, విశ్వానికి సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేయాలని అనుకుంటారు. నాసాలో ఉద్యోగం సాధించాలంటే ఎంతో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాసాలో ఉద్యోగం పొందాలంటే అర్హతలు ఏమి ఉండాలి? వంటి వివరాలు తెలుసుకుందాం..
ఎడ్యేకేషన్, స్కిల్స్
- నాసా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ చదివిన వారిని ఎక్కువగా ఉద్యోగాల్లో నియమించుకుంటుంది
- ఏరోస్పేస్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉన్నవారు ఉద్యోగాలు పొందొచ్చు
- మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ వంటివి ఉంటే మరింత మంచిది
- మీ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి
- సంబంధిత సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్ భాషలు, డేటా విశ్లేషణ వంటి వాటిల్లో ప్రావీణ్యాన్ని పొందాలి
Also Read: సునీతా విలియమ్స్‌కి భారీగా జీతం.. నాసాలో ఉద్యోగులకు ఎంత వేతనం ఉంటుందో తెలుసా?
అనుభవం
- ప్రాజెక్టులు, పరిశోధనలు చేస్తే అనుభవం వస్తుంది
- ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను కూడా నాసా అందిస్తుంది
- నాసా పాత్‌వేస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
- స్పేస్ రీసెర్చ్‌కు సంబంధించిన ఫెలోషిప్‌ల కోసం ప్రయత్నించండి
- మీ విద్యాభ్యాస సమయంలో పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొనండి
- నిపుణులతో కనెక్ట్ అవుతూ ఉండాలి
- అంతరిక్షానికి సంబంధించిన సమావేశాలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్‌లకు హాజరు కావాలి
- నాసా ఉద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను వాడుకోండి
ఇలా అప్లై చేసుకోండి
- ఇంటర్న్‌షిప్‌లు సహా నాసా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రధానంగా usajobs.govలో పోస్ట్ చేస్తారు
- అందులో మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోండి
- దరఖాస్తు చేసేముందు సూచనలను జాగ్రత్తగా చదవండి
- కెరీర్ అవకాశాలు, ఇతర ప్రోగ్రాంల గురించి నాసా అధికారిక వెబ్‌సైట్ nasa.gov చూస్తుండండి
ఇవి అవసరం
- వ్యోమగామి కావాలంటే అధునాతన కోర్సుల్లో డిగ్రీలు, వృత్తిపరమైన అనుభవం, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం అవసరం
- నాసా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను నియమించుకుంటుంది
- నాసాలో అడ్మినిస్ట్రేటివ్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ వంటి రంగాలలో కూడా ఉద్యోగాలు ఉంటాయి
- నాసాలోని చాలా పోస్టులకు అమెరికా పౌరసత్వం అవసరం