YS Jagan : ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. అసెంబ్లీ గేటు వద్ద జగన్ నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ సభ్యులు హాజరయ్యారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు.. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు.
- Harishth Thanniru
- Published On : February 11, 2026 / 10:50 AM IST
YS Jaganmohan Reddy
YS Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు సభలో నిరసన తెలిపారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఆ తరువాత కొద్ధిసేపటికి జగన్ మోహన్ రెడ్డితోపాటు వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
Also Read : APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శుభవార్త.. ఈ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
అంతకుముందు.. అసెంబ్లీ గేటు ఎదుట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్లకార్డు పట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు.
