×
Ad

YS Jagan Birthday : వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన చంద్రబాబు, పవన్, షర్మిళ, విజయసాయి రెడ్డి.. పలువురు ప్రముఖులు

YS Jagan Birthday : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో

YS Jagan Birthday

YS Jagan Birthday : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వైసీపీ నేతలు, జగన్ అభిమానులు పుట్టినరోజు కేక్‌ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల, విజయసాయిరెడ్డితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖలతోపాటు దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.’శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు కాంక్షించారు.


జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


వైఎస్ జగన్‌కు ఆయన చెల్లి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్ వేదికగా.. ‘వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ షర్మిల పేర్కొన్నారు.


వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. ప్రజాసేవలో మీకు మరింత శక్తి, విజయం లభించాలని కోరుకున్నారు.