YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..
YS Jagan : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
YS Jagan MP Mithun Reddy
YS Jagan : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాలు ఒకరిపైఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. అయితే, ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ మిథున్ రెడ్డికి ఫోన్ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read : AP Government : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లే..!
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన జగన్.. అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజల్లో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు లేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్లా మార్చారని మండిపడ్డారు. లోక్సభలో తమ పార్టీ నాయకుడికే భద్రత లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని జగన్ విమర్శించారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఈ అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ధైర్యం, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని న్యాయస్థానాల ముందు ఉంచుతామని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర తమ పార్టీదని, హింసతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుదని జగన్ విమర్శించారు.
