ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్

స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్

Ys Jagan Mohan Reddy

Updated On : July 23, 2024 / 6:47 PM IST

ప్రతిపక్ష నేతగా తనకు హోదా ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.

ప్రతిపక్షంలో ఎక్కువ మంది సభ్యులు ఎవరికి ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో సాంప్రదాయాలను పాటించాల్సి ఉందని చెప్పారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైసీపీకి 2024 ఎన్నికల్లో మాత్రం 11 సీట్లే వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో వైసీపీకి విపక్ష హోదా లభించే అవకాశం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ అంటుండగా, టీడీపీ-జనసేన-బీజేపీ సర్కారు నుంచి దీనిపై ఇప్పటికీ స్పందన రాలేదు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: బాబాయ్‌ని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుంది: చంద్రబాబు సంచలన కామెంట్స్