×
Ad

YS Jagan: క్యాడర్‌తో మీటింగ్స్‌.. జగన్ స్ట్రాటజీస్‌ ఛేంజ్..!

కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టీవ్‌గా, దూకుడుగా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

YS Jagan (Image Credit To Original Source)

  • ముందు క్యాడర్‌..తర్వాతే ఎవరైనా అంటున్న జగన్
  • వరుసగా కార్యకర్తలతో భేటీలు..భవిష్యత్‌పై భరోసా
  • వస్తున్నాం..మళ్లీ మనదే అధికారమంటూ దిశానిర్దేశం
  • క్యాడర్‌లో 2019కు ముందు నాటి జోష్‌, కసిని పెంచే ప్లాన్

YS Jagan: గతం..గతః. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటి లెక్కలు వేరు. ఈక్వేషన్స్‌ కూడా సమ్‌థింగ్‌ స్పెషల్. ఇప్పుడు అలా కాదు. అపోజిషన్‌లో ఉన్నామ్. క్యాడర్‌ స్ట్రాంగ్‌గా లేకపోతే మళ్లీ అధికారంలోకి రాలేం. పార్టీ కూడా నిలబడదు. అందుకే కార్యకర్తలకే ప్రయారిటీ ఇవ్వాల్సిందేనని ఫిక్స్ అయిపోయారట వైసీపీ అధినేత జగన్. 2019 నుంచి 2024 వరకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రతి ఇంటికి పథకం ఇస్తున్నాం..తన ఫొటో చూసే జనం ఓటేస్తారన్న ధీమాలో ఉండిపోయారు. కానీ తమకు సంబంధం లేకుండా గ్రామంలో పనులు జరిగిపోవడమే కాదు..స్కీమ్స్ అమలులో కూడా క్యాడర్‌ ప్రమేయం లేకుండా చేయడంతో..లోకల్‌లో తమకు పలుకుబడి లేకుండా పోయిందని..కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారన్న చర్చ ఉంది.

ఈ కారణంతోనే గత ఎన్నికలకు ముందు జగన్‌కు కార్యకర్తలు దూరమయ్యారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ టైమ్‌ సీఎం అవడం..పాలనా విషయాల్లో నిమగ్నం అవ్వడంతో..2024 వరకు అధినేత క్యాడర్‌కు పెద్దగా టైమ్‌ ఇవ్వలేకపోయారని వైసీపీ లీడర్లే చెప్పుకుంటుంటారు. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కార్యకర్తలు యాక్టీవ్‌గా పనిచేయకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

తప్పు మరోసారి రిపీట్ కాకుండా అలర్ట్
అయితే అలాంటి తప్పు మరోసారి రిపీట్ కాకుండా అలర్ట్ అవుతున్నారట జగన్. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నారు జగన్. వారానికి రెండు రోజులు కార్యకర్తలను నేరుగా కలుస్తున్నారు. ఒక్కొక్కరికి సమయం ఇచ్చి వారితో ఫోటో దిగుతూ వాళ్లు..పోరాడుతున్న తీరు..సోషల్‌ మీడియా ఫైట్..పార్టీ కోసం చేస్తున్న త్యాగాలపై ఆరా తీస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.

గత ఆరు నెలల్లో కార్యకర్తలతో భేటీకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. జగన్ తాడేపల్లిలో ఉన్నారంటే చాలు..కార్యకర్తల మీటింగ్‌..పక్కాగా తన షెడ్యూల్‌లో ఉండేలా చూస్తున్నారు. అయితే ఇక నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. నియోజకవర్గంలో క్రియాశీలకంగా పార్టీకోసం పనిచేస్తున్న వారిని తాడేపల్లికి పిలిపించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

నేతల పనితీరుపై ఫీడ్ బ్యాక్ 
మొదటగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి..పార్టీ పరిస్థితి..నేతల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు జగన్. సంక్రాంతి తర్వాత జిల్లా కేంద్రాలకు వెళ్లి సమావేశాలు పెట్టాలని అనుకున్నా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు పూర్తి కాకపోవడంతో తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు జగన్.

పార్టీ ఘోర ఓటమి పాలైనా..లీడర్లు అంతా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయినా..ఆ మాటకొస్తే అధినేతే గ్రౌండ్‌కు దూరంగా ఉన్నా..ఫ్యాన్ పార్టీ క్యాడర్‌ మాత్రం అన్నీ తామై ఫైట్ చేస్తోంది. అటు గ్రౌండ్‌లో..ఇటు సోషల్‌ మీడియాలో ఎక్కడా తగ్గకుండా..కూటమితో ఢీ అంటే ఢీ అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో క్యాడర్‌కు ఇంకా బూస్టప్‌ ఇచ్చేందుకు..ధైర్యం నూరిపోసేందుకు..వరుస మీటింగ్స్ పెడుతున్నారట జగన్.

జగన్ వ్యూహం ఇదే?
కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టీవ్‌గా, దూకుడుగా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. 2019కి ముందు కార్యకర్తలు పార్టీ అధికారంలోకి రావాలని ఎంత జోష్‌తో పనిచేశారో..క్యాడర్‌లో మళ్లీ అంత కసి..జోష్‌ను నింపాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. ఇందుకోసమే నిత్యం కార్యకర్తలతో సమావేశాలు పెడుతూ, వాళ్లను కలుస్తున్నారు. క్యాడర్‌తో..లీడర్లకు, అధినేతకు అటాచ్‌మెంట్‌ ఎంత పెరిగితే పార్టీకి అంత ప్లస్ పాయింట్‌ అని..ఇక కార్యకర్తలను నెగ్లెక్ట్ చేస్తే కుదరదని ఫిక్స్ అయిపోయారట.

కేసులు..ఒత్తిళ్లు ఉన్నా..పార్టీ కోసం సర్వం త్యాగం చేసి పోరాడుతున్న వారిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట జగన్. అలా అయితే కార్యకర్తల మనోధైర్యం పెరిగి..కష్టపడి పనిచేస్తే అధినేత గుర్తిస్తారనే నమ్మకం కలిగి ఇంకా బాగా పనిచేస్తారని భావిస్తున్నారట. రాబోయే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని జగన్‌ వేస్తున్న స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.