×
Ad

YS Jagan : 150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట

ys jagan : ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ys jagan

YS Jagan : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ బడ్జెట్‌తో కలిపి మూడు బడ్జెట్‌లు పెట్టినట్లు అవుతుంది. ఈ రెండేళ్లలో చంద్రబాబునాయుడు పాలన వల్ల ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా..? అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం భీమవరం నియోజకవర్గ కేడర్ తో భేటీ అయిన జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Party Defections Case : పార్టీ ఫిరాయింపుల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్యే దానంకు నోటీసులు

గతంలో ఒక మాట చెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం ఉండేది. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్న తపన, తాపత్రయం ఉండేది. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలన్నీ రద్దైపోయాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్దాలుగా తేలిపోయాయి. సంక్రాంతిరోజు చూస్తే.. ప్రభుత్వమా..? జంగిల్‌రాజ్ అన్నట్లు అనిపించింది. చూడాలి. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు నడిపారు. తాగరా.. తాగి చిందేయరా.. అన్న రీతిలో జరిగాయి. అటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోందని జగన్ అగ్రహం వ్యక్తం చేశారు.

కోడి పందాలు నడపడానికి వేలం పాటలు నిర్వహించారు. పులివెందులలోనూ కోడిపందాలకు వేలంపాటలు పెట్టారు. ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తోంది.. వచ్చిన సొమ్మును ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేశ్, పోలీసు అధికారులు పంచుకున్నారని జగన్ ఆరోపించారు.

భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యంవేసింది. డీఎస్పీ ఊపేయ్.. కుదిపేయ్.. అంటున్నాడు. మనం ఏ సమాజంలో ఉన్నామో అర్ధంకావడం లేదు. రాష్ట్రం జంగిల్ రాజ్ అయ్యింది. బరితెగింపునకు అడ్డులేకుండా పోయింది. విచ్చలవిడిగా మనం ఊహించని స్థాయికి వెళ్లిపోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది
. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్‌ చేయించుకున్నాడు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అరెస్టు చేయాల్సిందిపోయి, బాధిత మహిళను జైలుకు పంపారని జగన్ అన్నారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ రికార్డింగ్‌ డ్యాన్సులు వేశాడు
. రాష్ట్రం జంగిల్ రాజ్ లా మారిపోయిందని జగన్ అన్నారు.

పాదయాత్రపై జగన్ మాట్లాడుతూ.. ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో నేను కూడా పాలనమీద ఎక్కువ దృష్టి పెట్టాను. కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మంచి జరిగేలా ఉంటుందని జగన్ అన్నారు.