Ys Jagan Mohan Reddy
Ys Jagan : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ముందుగా ఈ నెల 22న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అందుకు బదులుగా ఈ నెల 20వ తేదీనే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది వైసీపీ.
ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు జగన్ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారని సమాచారం.
Also Read : ఎవర్నీ వదలం.. ఆరోగ్యశ్రీ పథకంపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
ఇక, జగన్ తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు (జూన్ 19) జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తాజాగా ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.