జగన్ కీలక సమావేశం.. వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైసీపీ

విజయవాడలో భారీ వరదలపై సోమవారం వైఎస్‌ జగన్‌ స్వయంగా వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే.

YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు వైఎస్సార్సీపీ రూ.కోటి సాయం ప్రకటించింది. అమరావతిలో ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వరద బాధితులకు ఆర్థిక సాయం ఇవ్వాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో భారీ వరదలపై సోమవారం వైఎస్‌ జగన్‌ స్వయంగా వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే. వరద బాధితులతో జగన్ మాట్లాడి, వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇవాళ నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలోనూ వరదలపై చర్చలు జరిపారు.

వరద బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్‌కు వైసీపీ నాయకులు కూడా ఈ సమావేశంలో తెలిపారు. సోమవారం తాను చేసిన పర్యటనలో వరద బాధితుల సమస్యలను స్వయంగా చూశానని జగన్ అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని జగన్‌ వివరించారు.

ఏపీ సర్కారు తప్పిదం వల్లే వరదలు ముంచెత్తాయని తెలిపారు. ఇవాళ నిర్వహించిన పార్టీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పలువురు మాజీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Also Read: హమ్మయ్య.. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరిపీల్చుకున్న బెజవాడ జనం..!

ట్రెండింగ్ వార్తలు