వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ.. కీలక సూచనలు

YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ అమరావతిలో సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. అది మరచిపోకూడదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పారు.

ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎల వ్యవహారాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే తప్పులను లెక్కించాలని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన హనీ మూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇద్దామని తెలిపారు.

ఆ తర్వాత ప్రజా పోరాటాలు చేద్దామని తెలిపారు. అసెంబ్లీలో వైసీపీ నోరు లేపకుండా టీడీపీ కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు. శాసన మండలిలో పోరాటం చేద్దామని అన్నారు. కేసులు పెడతారని, ప్రలోభాలు పెడతారని, తట్టుకోవాలని అన్నారు. ప్రజల కోసం వైసీపీ నేతలు నిలబడాలని చెప్పారు.

Also Read: ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు