Site icon 10TV Telugu

Ys Jagan : పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు : వైఎస్ జగన్

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

Ys Jagan : పులివెందుల నియోజకవర్గంలో ఒక జడ్పీసీటును బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఒంటిమిట్టలో జడ్పీటీసీ సీటును కైవసం (Ys Jagan) చేసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాలను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు.

అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం దెబ్బతిన్న ఈరోజు నిజంగా బ్లాక్ డే అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Read Also : Nara Lokesh : పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది.. మంత్రి నారా లోకేష్

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో ఎన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం వహించడం చాలా విచాకరమని అన్నారు. రాజ్యంగ వ్యవస్థల మీద పూర్తి విశ్వాసం ఉందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పూర్తి సాక్ష్యాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Exit mobile version