జగన్ స్క్రీనింగ్.. సీఎం దూకుడుకు కారణమేంటి? ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యమా? 

  • Publish Date - June 22, 2020 / 03:29 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిసారించారు. ప్రతిరోజు పది మంది ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పథకాలు అమలు జరుగుతున్న తీరుపైనా కూడా జగన్ సమీక్షించనున్నారు. అయితే సీఎం జగన్ సడన్‌గా దూకుడు పెంచడానికి గల కారణమేంటి? జిల్లాలు, గ్రామాల పర్యాటన వెనుక లక్ష్యమేంటి? ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యమా? లోకల్ బాడీ ఎలక్షన్లే టార్గెట్టా? ఆగస్టు నుంచి గ్రామాల్లో జగన్ పర్యటించన్నారు.

తన ఏడాది పాలనపై తన జగన్ స్వయంగా స్ర్కీనింగ్ చేయనున్నారా? అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగన్ కార్యాచరణ ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఛాన్స్ లేకుండా ప్లానింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు వరుస అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని, అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది.

రోజుకు 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తు్న్నారనే రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేలకు, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఇదంతా వ్యక్తిగత వ్యవహారేమనని అంటున్నారని చెబుతున్నారు. నియోజక వర్గాల సమస్యలు, పథకాల అమలుతో పాటు నిధుల కేటాయింపు అంశాలపై కూడా సీఎం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలల భేటీలోని అంశాలతో జనం ముందుకు జగన్ వెళ్లనున్నారని వినిపిస్తోంది. 

మరోవైపు.. ఏపీలో కోవిడ్‌పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెష్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరు  కానున్నారు. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం ఆదేశించారు. 

ట్రెండింగ్ వార్తలు