ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా

రాజ్ భవన్ కు ఆయన లేఖ పంపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. రాజ్ భవన్ లోని గవర్నర్ కు ఆయన లేఖ పంపారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో జగన్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమతమయ్యే పరిస్థితి కనపడుతోంది.

టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా
వైసీపీ ఓటమితో టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. గత ఏడాది ఆగస్టులోనే ఆయన టీటీడీ ఛైర్మన్ పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా నిరాశలో మునిగిపోయారు.

కాగా, 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలు సాధించి ప్రభంజనం సృష్టించిన వైసీపీ ఈ సారి కేవలం 11 సీట్లను మాత్రమే దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఎంత భారీ మెజారిటీని సాధించిందో ఈ సారి అంతటి ఘోర ఓటమి పాలైంది.

Also Read: 100 శాతం కొట్టాం అంటూ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదిరిపోయిందంతే..