100 శాతం కొట్టాం అంటూ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదిరిపోయిందంతే..

అందరూ తనకు శుభాకాంక్షలు చెబుతోంటే తనకు భయమేస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

100 శాతం కొట్టాం అంటూ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదిరిపోయిందంతే..

Updated On : June 4, 2024 / 7:24 PM IST

Pawan Kalyan Post Result Speech: గెలిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన మాట్లాడారు. ఇది కక్ష సాధింపు సమయం కాదని చెప్పారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అన్నారు. ఎన్నో ఓటములు ఎదుర్కొన్నానని చెప్పారు. భారత దేశంలో 100 శాతం కొట్టామంటే అది జనసేనదేనని అన్నారు. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచామన్నారు.

మార్పుకావాలని కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారని తెలిపారు. వైఎస్ జగన్ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని అన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయమిది అని తెలిపారు. ఏరును దాటాక తెప్పను తన్నే మనిషిని తాను కాదని చెప్పారు.

తమపై ఇప్పుడు ఎంతో బాధ్యత ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక అందరమూ బాధ్యతతో పనిచేయాల్సి ఉందని చెప్పారు. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత తనదని తెలిపారు. 2019లో ఓడిపోయినప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని చెప్పారు. అందరూ తనకు శుభాకాంక్షలు చెబుతోంటే తనకు భయమేస్తోందన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని అదో పెద్ద బాధ్యతని తెలిపారు. అందుకే ఇలా ఉందన్నారు.

తాను ఓటమిని చూసి భయపడబోనని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటమి తనకు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. ధర్మోరక్షతి రక్షిత: అనే మాటను తాను నమ్మానని తెలిపారు. ఆ పనే తాను చేసుకుంటూ పోతున్నానని అన్నారు.

Also Read: మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ భావోద్వేగం.. కన్నీళ్లు ఆపుకుంటూ..