మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ భావోద్వేగం.. కన్నీళ్లు ఆపుకుంటూ..

YS Jagan: ఆయన కళ్లలో నీళ్లు వచ్చినట్లు కనపడింది. తాను ఎన్నో కష్టాలను కూడా అనుభవించానని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ భావోద్వేగం.. కన్నీళ్లు ఆపుకుంటూ..

Updated On : June 4, 2024 / 6:48 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై సీఎం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఘోర ఓటమిపాలయినందుకు ఆయన మాటల్లో కాస్త తడబాటు కనపడింది. కన్నీళ్లు ఆపుకుంటూ మాట్లాడారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చినట్లు కనపడింది.

తాను ఎన్నో కష్టాలను కూడా అనుభవించానని వైఎస్ జగన్ తెలిపారు. తనను ఇకపై ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుర్కొంటానని చెప్పారు. వైసీపీ ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడిందని జగన్ తెలిపారు.

ఏమన్నారు?

  • ఎవరు మోసం చేశారో.. ఎక్కడ అన్యాయం జరిగిందో తెలియదు
  • జరిగిన దానికి ఆధారాలు లేవు కనుక ఏమీ చెయ్యలేము
  • పోరాటాలు, కష్టాలు నాకు, మా పార్టీకి కొత్త కాదు
  • నా రాజకీయ జీవితం మొత్తం పోరాటాలు కష్టాలే
  • మళ్లీ పోరాటం చేస్తాం
  • గతంలో మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు
  • మేము ప్రతి ఒక్కరికీ మంచి చేసినా ఓటమి పాలయ్యాం

Also Read: ఘోర ఓటమిపై జగన్‌ కీలక వ్యాఖ్యలు