ఘోర ఓటమిపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

YS Jagan: కూటమిలో ఉన్న నేతలకు అభినందనలు చెబుతున్నాను అని అన్నారు.

ఘోర ఓటమిపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపర్చాయని అన్నారు. ఎంతో మంచి చేసినా కూడా ఓటమి తప్పలేదన్నారు. అక్కాచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయే తెలియడం లేదని చెప్పారు.

అమ్మ ఒడిని 53 లక్షల మంది తల్లులు అందుకున్నారని తెలిపారు. పిల్లలు బాగుండాలని అడుగులు వేశామని చెప్పారు. పిల్లల చదువు కోసం ఏ తల్లీ అవస్థ పడకూడదని అనుకున్నామని తెలిపారు. సచివాలయ వ్యవస్థను, వాలంటరీల వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.

  • జగన్ కామెంట్లు
  • మహిళా సాధికారత అంటే ఇదీ అని ప్రపంచానికి చాటి చెప్పాం
  • సామాజిక న్యాయం అంటే ఇదీ అని ప్రపంచానికి చేసి చూపించాం
  • ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా ఓడిపోయాం
  • ఎవరో మోసాలు చేశారని అనవచ్చు కానీ, ఆధారాలు మాత్రం లేవు
  • ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం
  • ఎల్లప్పుడూ పేదవారికి తోడుగా ఉంటాం
  • కూటమిలో ఉన్న నేతలకు అభినందనలు చెబుతున్నాను
  • నా ప్రతి కష్టంలోనూ తోడుగా ఉన్న నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నాను
  • అవ్వాతాతల ఇంటికే పెన్షన్లు పంపించాం
  • 54 లక్షల మంది రైతులకు తోడుగా ఉన్నాం
  • సమయానికి రైతు భరోసా ఇచ్చాం
  • ఆ రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు
  • మ్యానిఫెస్టోను పవిత్రంగా భావించాం
  • ఏకంగా 99 శాతం హామీలు అమలు చేశాం

Also Read: మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ భావోద్వేగం.. కన్నీళ్లు ఆపుకుంటూ..