YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష.. అంతకుముందు పలువురు నేతలను కలిసి..

రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని షర్మిల అన్నారు.

YS Sharmila

ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. విభజన హామీల అమలుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ధర్నాకు ముందు పలువురు నేతలను ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. తమకు మద్దతు ఇవ్వాలని, పార్లమెంట్లో ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. షర్మిలతో పాటు ధర్నాలో కేవీపీ, జేడీ శీలం, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, తదితరులు కూర్చున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు వచ్చేవని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీలు ఏమయ్యాయని నిలదీశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ రైల్వే జోన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని అన్నారు.

షర్మిల కామెంట్స్

  • విభజన సమయంలో ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తా అంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని కామెంట్స్ చేసింది
  • హమీలను నెరవేర్చట్లేదు
  • పోలవరం ఏర్పాటు వల్ల వెయ్యి మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది
  • 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించినా లాభం లేదు
  • తిరుపతి సభలో నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • మోదీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పారు
  • ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ కడతామని హామీ ఇచ్చారు
  • 10 సంవత్సరాలైనా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు
  • దుగ్గిరాజ పట్నం పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు
  • వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు
  • విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని ఇవ్వలేదు
  • ఎన్నికల సమయంలో మాత్రమే ఆంధ్ర ప్రజలు గుర్తుకువస్తారా?
  • ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీపై అసహనంతో ఉన్నారు
  • రాష్ట్రంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఒక్క ఎంపీ సీట్లు లేకుండా రాజ్యమేలుతోంది
  • గతంలో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. బీజేపీకి గులాం గిరి చేస్తున్నాయి
  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి గులాం గిరి చేస్తున్నాడు
  • గతంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీ స్థానాలు వస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు
  • చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి

బీజేపీ నుంచి క్లారిటీ రాకుంటే ఈ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసే ఆలోచనలో టీడీపీ-జనసేన

ట్రెండింగ్ వార్తలు