‘‘జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కొట్లాడారు.. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? అని అన్నారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమమైనా చేశారా?’ అని షర్మిల నిలదీశారు.
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గత రాత్రి ఇడుపులపాయలోనే షర్మిల బస చేశారు. ఇవాళ ఉదయం రోడ్డు మార్గంలో కడపకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.
సీఎం జగన్‌పై నిప్పులు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేకహోదా కావాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ జగన్.. సీఎం అయ్యాక దాన్ని పక్కనపెట్టారంటూ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులు కడతానని చెబుతున్నారని, ఏపీకి కనీసం ఒక్క రాజధాని కూడా లేదన్నారు.
షర్మిల కామెంట్స్
టీడీపీ, వైసీపీ దొందు దొందే
పోలవరాన్ని తాకట్టుపెట్టారు
ఏపీకి రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా?
రాజధాని కట్టడానికి డబ్బుల్లేవు
ఆంధ్రాలో ఒక్క మెట్రో అయినా వుందా?
ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇస్తున్నారా?
దళితులపై దాడులు వంద శాతం పెరిగాయి
దోచుకోవడం..దాచుకోవడం.. ఇదే జరుగుతోంది
ప్రత్యేక హోదా ఏమైంది?
ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి
పాలకులకు ప్రత్యేక హోదా తేవడం చేతకాలేదు
బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామన్నారు
చంద్రబాబు పదిహేనేళ్లు కావాలని అడిగారు
బీజేపీతో పొత్తు పెట్టుకొని సీఎం అయ్యాక, కేంద్ర మంత్రి పదవులు పొందాకా ఒక్క ఉద్యమం అయినా చేశారా?
జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కొట్లాడారు
మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? అని అన్నారు
అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమమైనా చేశారా?
స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ
స్వలాభం కోసం తాకట్టు పెట్టారు
వైఎస్ బిడ్డగా నాకు ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పడం గర్వకారణంగా ఉంది
నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పడం సంతోషంగా ఉంది
నేను రావాలని కాంగ్రెస్ కు పనిచేయాలని ఎంతోమంది త్యాగాలు చేశారు