YS Sharmila: పోలీసులపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ‘ఏం సర్.. ప్రభుత్వానికి భయమేస్తుందా?’ అంటూ విమర్శ..
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.

YS Sharmila
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ విజయవాడలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్ షర్మిల. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల రోడ్డు మార్గంలో కడపకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు. నిడమానూరులో షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.
షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రమే రామవరప్పాడు మీదుగా పంపించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాన్వాయ్‌ను మధ్యలోనే నిలిపివేశారు షర్మిల. మరోవైపు, తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
కారులో నుంచే షర్మిల మీడియాతో మాట్లాడారు. భయపడుతున్నారా సర్? అని ఆమె అనడం గమనార్హం. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తమ కాన్వాయ్‌ను దారి మళ్లించారని తెలిపారు. ‘ఏం సర్.. ప్రభుత్వానికి భయమేస్తుందా?’ అంటూ ఘాటుగా స్పందించారు. షర్మిలతో పాటే రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ ఉన్నారు.
పోలీస్ కమిషనర్ ఏమన్నారు?
షర్మిల కాన్వాయ్ స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. కాన్వాయ్‌కి ఎలాంటి ఆటకం కలగలేదని చెప్పారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ముందున్న వాహనాలు పంపామన్నారు. అంతేగానీ ఉద్దేశపూర్వకంగా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారనడంలో అర్థం లేదని చెప్పారు.