Ys sharmila : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

షర్మిల కాంగ్రెస్ జెండా ఎత్తుకుంటే... పోటీ వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్ మధ్య ఏస్థాయిలో ఉంటుంది? ఈ ముక్కోణపు పోటీలో చీలేది ఎవరి ఓట్లు? కలిసొచ్చేది ఎవరికి.. నష్టం కలిగించేది ఎవరికి? ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించలేని ఈ తాజా పరిణామాలు ప్రతి ఒక్కరిని అటెన్షన్‌లోకి తెస్తున్నాయి.

YS sharmila

Ys sharmila Will Join to Congress Party :  షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తుందా లేదా అన్నది.. నిన్నటి వరకు ఊహాగానం. ఇప్పుడు అది నిజం.. కొందరికి మింగుడుపడని నిజం… కొందరికి కలిసొచ్చే నిజం.. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదపనున్న షర్మిల నిర్ణయం. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి రంగప్రవేశంచేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికే ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇక అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ యుద్ధం ఏస్థాయిలో ఉంటుంది? ఇద్దరి పోరులో తల్లి విజయమ్మ ఎటు మొగ్గు చూపుతుంది.? వైసీపీలో టికెట్ పొందలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు… షర్మిల నీడన చేరి, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగప్రవేశం చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Also Read : జగన్ చెప్పినట్టే చేశాను.. నా తప్పంటే ఎలా?: వైసీపీ ఎమ్మెల్యే

షర్మిల కాంగ్రెస్ జెండా ఎత్తుకుంటే… పోటీ వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్ మధ్య ఏస్థాయిలో ఉంటుంది? ఈ ముక్కోణపు పోటీలో చీలేది ఎవరి ఓట్లు? కలిసొచ్చేది ఎవరికి.. నష్టం కలిగించేది ఎవరికి? ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించలేని ఈ తాజా పరిణామాలు ప్రతి ఒక్కరిని అటెన్షన్‌లోకి తెస్తున్నాయి. అందుకే ఈ పరిణామాలను వైసీపీ, టీడీపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. సో.. ఏపీలో సంక్రాంతి పండుగ మజా ముందే వచ్చింది.

 

షర్మిల తాజా నిర్ణయంపై 10టీవీ డిబేట్ ఇక్కడ చూడండి..