YS Viveka Murder Case : సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ

సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు వెళుతూ విజయమ్మతో అవినాశ్ రెడ్డి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

YS Viveka’s murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం (జనవరి 28,2023) సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. దీని కోసం హైదరాబాద్ చేరుకున్న అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తూ వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో విజయమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకున్నారు. అవినాశ్ రెడ్డి స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో పలువురి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అధికారలు వైసీపీ ఎంపీకి కూడా నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరుకావాలని.

కానీ ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రం తనకు ఇప్పటికే ఖరారు అయిన కార్యక్రమాలు ఉన్నాయని ఐదు రోజుల తరువాత విచారణకు హాజరవుతాను అంటూ సీబీఐకు లేఖ రాశారు. కానీ సీబీఐ అధికారులు మాత్రం అంత గడువు కుదరదని వీలైనంత త్వరలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేయటంతో ఈరోజు మధ్యాహ్నాం 3 గంటలకు హైదరాబాద్ లోని కోఠీలో ఉన్న సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకానున్నారు ఎంపీ. ఈ క్రమంలో లోటస్ పాండ్ లో వైఎస్ వివేకా వదిన..సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి ఆశీర్వాదాలు అవినాశ్ రెడ్డి తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. కాగా వివేకా హత్య కేసులో నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు. నా స్టేట్ మెంట్ రికార్డు చేసే ఆడియో, వీడియోలకు అనుమతి ఇవ్వాలని కోరారు.







                                    

ట్రెండింగ్ వార్తలు