YS viveka case : వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు..బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్‌లోకి బాడీని తెచ్చింది అతనే : సీబీఐ

వివేకా హత్యకు గురి అయ్యారనే విషయం బయటకు రాకుండా ఉండేదుకు బాడీకి కుట్లు కూడా వేశారని కుట్లు వేయటానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని పిలిపించారని.. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధారాలను తారుమారు చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. వివేకా చనిపోయారని నిర్ధారణ చేసుకునేవరకు అందరు ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది.

YS Viveka Case

YS viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని..తెలిసే అక్కడికి వచ్చాడని వివేకాను హత్య చేశాక బాడీని బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చింది కూడా ఉదయ్ కుమార్ రెడ్డే అని సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్న క్రమంలో ఈ హత్యకు పాల్పడినవారు కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఈకేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిపోర్టులో ఇటువంటి ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించింది సీబీఐ.

వివేకా హత్యకు గురి అయ్యారనే విషయం బయటకు రాకుండా ఉండేదుకు బాడీకి కుట్లు కూడా వేశారని కుట్లు వేయటానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని పిలిపించారని.. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధారాలను తారుమారు చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. వివేకా చనిపోయారని నిర్ధారణ చేసుకునేవరకు అందరు ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. కానీ విచారణలో ఉదయ్ కుమార్ రెడ్డి ఎటువంటి విషయాలను వెల్లడించటంలేదన్నారు. ఈకేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత రిమాండ్ రిపోర్టులో పలు విషయాలను సీబీఐ ప్రస్తావించింది.

రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి : హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్ళారు. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్‌లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి ప్రకాష్ రెడ్డిని పిలిపించి వివేకా మృతదేహానికి కుట్లు వేసి బ్యాండేజ్ వేయించారు. వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి ఉదయ్ కుమార్ రెడ్డే తీసుకొచ్చాడు. అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. వివేకా చనిపోయాడు అని తెలిసే వరకూ ఇంట్లోనే ఉన్నారు. వివేకా మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారు.

బాత్రూం నుంచి డెడ్ బాడీని బెడ్ రూమ్‌కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడు. వివేకా తలకున్న గాయాలను కనపించకుండా ఉండేందుకు..వివేకానంద రెడ్డి గుండెపోటు అని చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకం. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన తమ విచారణకు సహకరించడం లేదు. పారిపోతాడనే అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశాం. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధారాలను తారుమారు చేశారు. ఇలా పలు కీలక విషయాలను సబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.