YCP MP Avinash Reddy
YS viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈరోజు అంటే ఏప్రిల్ 17న (2023)హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. సీబీఐ తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటంతో ఇక ఈరోజు విచారణ తరువాత తనను కూడా అరెస్ట్ చేస్తుందనే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు అవినాశ్ రెడ్డి.
అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో భాస్కర్ రెడ్డిని విచారణ కోసం 14 రోజుల రిమాండ్ ఇవ్వాలని సీబీఐ కోరిక మేరకు కోర్టు భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో తన విచారణ పూర్తి అయ్యాక సీబీఐ తనను కూడా అరెస్ట్ చేస్తుందనే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ఇలా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
YS Avinash Reddy : ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఏం జరగనుంది?
కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో సీబీఐ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు బయటకువచ్చాయి. సీబీఐ (CBI) దాఖలు చేసిన కస్టడీ రీపోర్టులోని అంశాలు 10 టీవీకి చేతిలో ఉన్నాయి. 2019, మార్చి 15న జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి కిలక పాత్ర పోషించారని సీబీఐ తెలిపింది. ఈ హత్యకు పథకం రచించింది భాస్కర్ రెడ్డి అని స్పష్టంచేసింది సీబీఐ. సాక్ష్యాలు తారు మారు చెయ్యడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకు భాస్కర్ రెడ్డిని ఆరెస్ట్ చేశామని పేర్కొంది. ఆయన ఫోనును అధికారులు సీజ్ చేశారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది. అరెస్ట్ అయిన వెంటనే భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకోగా ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ముందుగానే బెయిల్ పిటీషన్ కోరారు.
కాగా..వివేకా హత్య కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ నాలుగుసార్లు విచారించింది.తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం..విచారణ తరువాత ఏం జరగబోతుంది?అనేది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. తండ్రిని అరెస్ట్ చేసినట్లుగానే కొడుకు అవినాశ్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. నా తండ్రి అరెస్ట్ ను ఊహించలేదని సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాశ్ రెడ్డి తాను కూడా అరెస్ట్ అవుతారనే భయంతోనే ముందుగానే బెయిల్ కోసం పిటీష్ వేసినట్లుగా సమాచారం.
YS Viveka Case: వైఎస్ వివేక హత్యకు కుట్ర పన్నింది భాస్కర్ రెడ్డే: సీబీఐ రిపోర్టులో సంచలన విషయాలు