YS Avinash Reddy : ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఏం జరగనుంది?

Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపారు. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

YS Avinash Reddy : ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఏం జరగనుంది?

Avinash Reddy

YS Avinash Reddy : ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి నోటీసులిచ్చింది సీబీఐ. రేపు(ఏప్రిల్ 17) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు పంపారు.

ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాఫ్తు వేగవంతం చేసింది. ఇవాళ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. మరొకసారి ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read..YS Viveka Case: వైఎస్ వివేక హత్యకు కుట్ర పన్నింది భాస్కర్ రెడ్డే: సీబీఐ రిపోర్టులో సంచలన విషయాలు

వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని నాలుగుసార్లు విచారించారు. ఆయన స్టేట్ మెంట్ ను నమోదు చేశారు. ఈ తరహాలో మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి సీబీఐ న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ క్రమంలో మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులివ్వడం.. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అనే చర్చకు దారితీసింది.

Also Read..YS Viveka Case: హైదరాబాద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి.. వివేక కేసులో సంచలన వ్యాఖ్యలు