Ys Viveka
YS Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బి వసతి గృహంలో పలువురిని విచారణకు పిలిచారు సీబీఐ అధికారులు. మరోవైపు సునీల్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలపై జమ్మలమడుగు కోర్టులో విచారణ జరగనుంది. సునీల్‌ను నార్కో పరీక్షలకు అనుమతివ్వాలంటూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read More : Union Minister Kishan Reddy : రేపటి నుంచి కిషన్‌రెడ్డి జనఆశీర్వాదయాత్ర
అయితే.. పులివెందుల కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో పిటిషన్ జమ్మలమడుగు కోర్టుకు బదిలీ చేశారు. 2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం జమ్మలమడుగు కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. మరోవైపు సీబీఐ అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు వివేకా కుమార్తె సునీత రెడ్డి. సీబీఐ విచారణకు సునీల్ సహకరించలేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. నార్కో అనాలిస్ టెస్ట్ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయంటున్నారు. హత్యలో ఎవరెవరి హస్తముంది. ఎందుకు చంపారు.. హత్యకు ఎన్నిరోజుల ముందు స్కెచ్ గీశారు. వివేకాను చంపడానికి కారణాలేంటి అన్నవిషయాలు నార్కో అనాలిసిస్ టెస్టులోనే తేలుతాయంటున్నారు సీబీఐ అధికారులు.
Read More : Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..
మరోవైపు…వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో భాస్కర్‌రెడ్డి పేరుకూడా ఉంది. దీంతో ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. సీబీఐ విచారణకు వైఎస్ వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి, సునీల్ యాదవ్ బంధువు భరత్ కుమార్ హాజరయ్యారు.