ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు…అదనంగా మరో 223 చికిత్సలు

  • Publish Date - November 11, 2020 / 07:41 PM IST

YSR Arogyasree Services : ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతున్న ఆరోశ్రీ పథకాన్ని.. మిగతా 6 జిల్లాల్లో కూడా వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథకంలోకి నూతనంగా చేర్చిన 887 చికిత్సా విధానాలను మిగతా జిల్లాలకు కూడా వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.



శ్రీకాకళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా చికిత్సా విధానం వర్తింప చేస్తున్నట్లు బుధవారం ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఉన్న 2200 వైద్య చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.



పథకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. పథకం కింద జారీ చేసిన ఈ వైద్య చికిత్సా విధానాలతోపాటు నూతనంగా అమలు చేసిన ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.