YSR Pension Kanuka : వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. జనవరి1 నుంచి రూ.2,500

జనవరిలో కొత్తగా లక్షా 41వేల మందికి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను ఏపీనే చెల్లిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

YSR pension increase : ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి పెన్షన్‌ను 2వేల 500ల రూపాయలకు పెంచనున్నారు. అలాగే ఐదు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించనున్నారు. రేపు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అలాగే అన్ని జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61లక్షల 75వేల మంది లబ్ధిదారులకు డబ్బులు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1560.60కోట్ల రూపాయలను విడుదల చేసింది.

TSRTC : న్యూ ఇయర్‌ వేడుకల కోసం టీఎస్ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

జనవరి నెలలో కొత్తగా లక్షా 41వేల మందికి పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తుంది ఏపీనే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. దీనికోసం ప్రతి ఏటా దాదాపు 18వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.

రేపు ఉదయం పదిన్నర గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బయల్దేరతారు. 10.55 గంటలకు ఆయన ప్రత్తిపాడు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో పెన్షనర్లకు నగదు అందజేస్తారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ట్రెండింగ్ వార్తలు