TSRTC : న్యూ ఇయర్ వేడుకల కోసం టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
రేపు 12ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది టీఎస్ఆర్టీసీ. ఈమేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
TSRTC bumper offer : న్యూ ఇయర్ వేడుకల కోసం తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ శివారుల్లోని ఈవెంట్లకు అదనపు బస్ సర్వీస్లను ఏర్పాటు చేసింది. శివారులోని 15 ప్రాంతాలకు అందుబాటులో బస్సు సర్వీసులు ఉండనున్నాయ్. ఈవెంట్లకు వెళ్లేందుకు ఇవాళ రాత్రి 7:30 నుంచి 9:30 గంటల వరకూ బస్సుల సౌకర్యం ఉంటుంది.
తిరుగు ప్రయాణానికి అర్ధరాత్రి 12:30 నుంచి 3 గంటల వరకూ బస్సులు నడవనున్నాయి. ఒక్కరికి 100 రూపాయల చార్జ్ చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక 18 సీట్ల ఏసీ బస్సుల్లో వెళ్లి వచ్చేందుకు 4 వేలతో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది.
COVID 19 Cases: ముంబై, ఢిల్లీలో భారీగా కరోనా కేసులు.. మూడో వేవ్కి సంకేతమా?
అలాగే రేపు 12ఏళ్లలోపు చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని ఎండీ సజ్జనార్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై మంచి స్పందన వస్తోంది.