COVID 19 Cases: ముంబై, ఢిల్లీలో భారీగా కరోనా కేసులు.. మూడో వేవ్‌కి సంకేతమా?

కరోనా మూడో వేవ్‌కి సంకేతం వచ్చేసిందా? అసలు స్టార్ట్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.

COVID 19 Cases: ముంబై, ఢిల్లీలో భారీగా కరోనా కేసులు.. మూడో వేవ్‌కి సంకేతమా?

Corona (2)

COVID 19 Cases: కరోనా మూడో వేవ్‌కి సంకేతం వచ్చేసిందా? అసలు స్టార్ట్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అవునూ.. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ ప్రకారం.. ముంబైలో గురువారం 3వేల 671 కేసులు, ఢిల్లీలో 1,313 కేసులు వెలుగులోకి వచ్చాయి.

రెండు నగరాల్లోనూ, కరోనా యొక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తుంది. ముంబైలో 190 ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 327కి చేరుకుంది. అదే సమయంలో, ఢిల్లీలో 263 కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి.

మూడో వేవ్‌కి ‘ఓమిక్రాన్’ కారణమా? అనే ప్రశ్నపై, ఢిల్లీ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ” ఒమిక్రాన్ నెమ్మదిగా సమాజ స్థాయిలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు పెరగవచ్చు. “కోవిడ్-19తో 200 మంది రోగులు ఢిల్లీ ఆసుపత్రుల్లో చేరగా.. వారి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించామని, అందులో 46శాతం ‘ఓమిక్రాన్’గా తేలిందని అన్నారు.

కొత్త రూపంలో కరోనా వైరస్ ‘ఓమిక్రాన్’ వ్యాప్తి చెందడంతో పాటు ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రమానుగత ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళిక(GRAP) కింద DDMA మంగళవారం ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ముంబైలో కూడా పలు ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక మరియు గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు పాజిటివిటీ రేటు ఆధారంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నట్లు కేంద్రప్రభుత్వం చెబుతోంది.

గడిచిన 10రోజుల డేటా:

Date ముంబై ఢిల్లీ
29 డిసెంబర్ 2510 923
28 డిసెంబర్ 1377 496
27 డిసెంబర్ 809 331
26 డిసెంబర్ 922 290
25 డిసెంబర్ 757 249
24 డిసెంబర్ 683 180
23 డిసెంబర్ 602 118
22 డిసెంబర్ 490 125
21 డిసెంబర్ 327 102
20 డిసెంబర్ 204 91