YSRCP: గుంటూరులో వైసీపీకి కొత్త తలనొప్పి మొదలైందా?

మొత్తంగా చూస్తే.. వైసీపీలో రాజకీయాలు సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి.

YSRCP

మార్పు మంచిదే.. కాని కొన్నిసార్లు బెడిసి కొట్టినా కొట్టుద్ది. ఒక దగ్గర వర్క్ అవుట్ ఐనా ఫార్ములా మరో దగ్గర ఫెయిల్ అవుతుంది. ఏపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇదే రుజువు చేశాయి. ఇన్చార్జీలను మార్చినా వైసీపీకి ఓటమి తప్పలేదు. దీంతో అంతర్మథనంలో పడిపోయిన వైసీపీ మళ్లీ ఇన్చార్జీలను మార్చే పనిలో పడిందా.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జీలను మార్చాలనుకుంటుందా.. కానీ అక్కడ ఒకరికి అప్పగిస్తే.. మరొకరు అసంతృప్తి గళం విప్పేలా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడు స్థానాల్లో పరిస్థితి ఇలానే ఉంది. మరీ ఆ మూడు సెగ్మెంట్ల పంచాయితీని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది. అధిష్టానం బుజ్జగింపులకు బెట్టుదిగేది ఎవరు.?

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చి బరిలోకి దిగింది. కానీ వైసీపీ వ్యూహం వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో ఓటిపోయిన చోట ఉండలేమని కొందరు నేతలు నియోజకవర్గాన్ని మళ్లీ మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. దీంతో తమ ఇన్‌చార్జ్‌ పోస్ట్‌ని మార్చాలంటూ హైకమాండ్‌కు రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. మరి హైకమాండ్ వారి విన్నపాలను మన్నిస్తుందా. లేదంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

మూడు స్థానాల్లో వైసీపీ తర్జనభర్జన 
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు స్థానాల్లో ఇన్‌చార్జీల విషయంలో వైసీపీ తర్జనభర్జన పడుతోంది. సత్తెనపల్లి, రేపల్లె, మంగళగిరి నియోజకవర్గాల్లో ఇంచార్జ్ ల నియామకంపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓటమి పాలైన అంబటి రాంబాబు.. ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా రావడం లేదు. ఆయన గుంటూరు ఈస్ట్ లేదంటే రేపల్లె వెళ్లేందుకు ముచ్చటపడుతున్నారు.

ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి వెళ్లిపోయారు. రేపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. దీంతో బలమైన వ్యక్తి అయితేనే మంత్రిని ఎదుర్కోవడం సులభం అవుతుందని వైసీపీ అధిష్టానం. దీంతో రేపల్లెను అంబటిని తీసుకువచ్చే ఆలోచన చేస్తుంది వైసీపీ హైకమాండ్. అంబటికి బాధ్యతలు అప్పగిస్తే.. టీడీపీలోకి వెళ్లిన మోపిదేవి వర్గానికి షాక్ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది.

ఇక, తన పదవికి ఎసరు వస్తోందని గ్రహించిన రేపల్లె వైసీపీ ఇన్చార్జ్ గణేశ్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. తనకు ఇబ్బంది కలిగించేలా చర్యలు తీసుకుంటే.. తన దారి తాను చూసుకుంటానని చెప్పేశారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన జనసేన అధినేత పవన్కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నవారికి లైకులు కొడుతున్నారు. అంటే.. ఒకరకంగా వైసీపీకి గణేశ్ సంకేతాలు పంపిస్తున్నట్లే లెక్క.

క్లారిటీ లేదు
ఇక గుంటూరు జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం మంగళగిరి విషయంలోనూ వైసీపీ ఓ క్లారిటీకి రాలేకపోతుంది. 2019, 2014లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఆర్కేను తప్పించి బీసీ మహిళకు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లారు. మళ్లీ అక్కడ ఇమడలేక తిరిగి వైసీపీలోకి తిరిగి వచ్చారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటాచేస్తానని చెబుతూ వస్తున్నారు.

అయితే సత్తెనపల్లికి వెళ్లి పార్టీ కార్యక్రమాలను చూసుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం అందింది. కానీ, ఆళ్ల ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే.. ఆయన సత్తెనపల్లికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

ఇక పొన్నురు రాజకీయాలు కూడా వైసీపీని అంతర్మథనంలో పడేస్తున్నాయి. ఇక్కడి నుంచి కీలకంగా ఉన్న నేత కిలారి వెంకట రోశయ్య జనసేనకి వెళ్లిపోయారు. మరోవైపు 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అంబటి మురళి చిత్తుగా ఓడిపోయారు. ఒక అప్పటి నుంచి ఆయన పొన్నూరు వైపు చూడడం లేదు. దీంతో పొన్నూరు ఇన్చార్జ్ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే ఆలోచన చేస్తుంది వైసీపీ అధిష్టానం.

మొత్తంగా చూస్తే.. వైసీపీలో రాజకీయం సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి. మరి ఇవి సక్సెస్ అవుతాయా? ముసలం పుట్టిస్తాయా? అనేది చూడాలి.

ఢిల్లీకి విడివిడిగా రేవంత్, భట్టి.. ఎవరికి వారు వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి?