Ys Jagan Mohan Reddy : వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ముఖ్య నేతలు కలిశారు. తన క్యాంప్ కార్యాలయంలో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కలిశారు. నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు జగన్.
ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు.. ఫలితాలు వచ్చాక వరుసగా జగన్ ను కలుస్తున్నారు. గత 4 రోజుల నుంచి ప్రతిరోజూ కొంతమంది అభ్యర్థులు వచ్చి జగన్ ను కలుస్తున్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరుగుతోంది. ఓటమికి దారితీసిన పరిస్థితులు, ఇంతటి దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయి? అనేదానిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం.. వీటన్నింటికి కారణాలు ఏంటి? అనే అంశంపై జగన్ నుంచి నేతలు తెలుసుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపైనా డిస్కస్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. జగన్ కూడా ట్వీట్ చేశారు. ఈ దాడులకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణకు వైసీపీ సిద్ధమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై