Kodali Nani: కొడాలి నాని హెల్త్ అప్‌డేట్‌… ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం

Kodali Nani

Kodali Nani Health: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వైద్యులు నానికి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ముంబైకి తరలించారు. ప్రత్యేక విమానంలో ముగ్గురు వైద్యుల పర్యవేక్ష బృందంతో కొడాలి నాని, ఆయన ఫ్యామిలీ ముంబైకు బయలుదేరి వెళ్లారు.

Also Read: Kakani Govardhan: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు..

తీవ్ర అనారోగ్యంతో ఈనెల 26న కొడాలి నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. నానికి పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ పూడుకుపోయినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు జగన్ సూచించారు. అయితే, తాజాగా.. మెరుగైన వైద్యం కోసం కొడాలి నానిని ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకు తరలించారు.