Praja Darbar: వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌కు భారీ స్పందన.. స్వల్ప ఉద్రిక్తత

పులివెందుల క్యాంపు కార్యాలయంలోకి జగన్ చేరుకునే సమయంలో ఈ తోపులాట జరిగింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. జగన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజాదర్బార్ కార్యక్రమంలో జగన్‌తో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నారు.

మరోవైపు, జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలను కంట్రోల్‌ చేయలేకపోవడంతో అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసినట్లు సమాచారం. అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పులివెందుల క్యాంపు కార్యాలయంలోకి జగన్ చేరుకునే సమయంలో ఈ తోపులాట జరిగింది. ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు.

కాగా, జగన్ ను ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి, రమేశ్ యాదవ్ కలిశారు. జగన్ ను రాయలసీమ వైసీపీ నేతలు కూడా కలిసి, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై జగన్ తో చర్చించే అవకాశ ఉంది.

Tollywood : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..