Tollywood : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

సీఎం మీటింగ్ లో టాలీవుడ్ పెద్దలు ఎవరెవరు ఏం మాట్లాడారు అంటే..

Tollywood : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

Tollywood Celebrities Comments in CM Revanth Reddy Meeting goes Viral

Updated On : December 26, 2024 / 12:06 PM IST

Tollywood : నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశం అయినా సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్, ప్రభుత్వం టాలీవుడ్ పై సీరియస్ అవ్వడంతో ఈ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది.

Also Read : CM Revanth Reddy : అసెంబ్లీ మాటకు కట్టుబడి ఉంటాను.. బెనిఫిట్ షోలు ఇవ్వను.. టాలీవుడ్ మీటింగ్ లో సీఎం ఏం చెప్పారంటే..

సీఎం మీటింగ్ లో టాలీవుడ్ పెద్దలు ఎవరెవరు ఏం మాట్లాడారు అంటే..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం అని అడిగారు.

నాగార్జున మాట్లాడుతూ.. హైదరాబాద్ లో యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని తెలిపారు.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలి అని అన్నారు.

Also Read : Director Bobby – Mokshagna : మోక్షజ్ఞ గురించి డైరెక్టర్ బాబీ కామెంట్స్.. అసలు అలాంటి కుర్రాడు మనకి దొరికితే..

సీనియర్ నటులు మురళి మోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం అని చెప్పారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి అని అన్నారు.