Director Bobby – Mokshagna : మోక్షజ్ఞ గురించి డైరెక్టర్ బాబీ కామెంట్స్.. అసలు అలాంటి కుర్రాడు మనకి దొరికితే..
తాజాగా డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Director Bobby Interesting Comments on Mokshagna in Daaku Maharaaj Promotions
Director Bobby – Mokshagna : బాలకృష్ణ తనయుడిగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తుండగా ఇటీవల మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
ఇక మోక్షజ్ఞ అప్పుడప్పుడు తండ్రి బాలకృష్ణ సినిమా సెట్స్ కి వెళ్తూ ఉంటాడు. ఆ సెట్స్ నుంచి మోక్షజ్ఞ ఫొటోలు వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. మోక్షజ్ఞ పై వేరే హీరోలు, డైరెక్టర్స్ కూడా గతంలో కామెంట్స్ చేసారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
బాబీ మాట్లాడుతూ.. మోక్షజ్ఞ ఓ నాలుగు సార్లు సెట్ కి వచ్చారు. అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు, చాలా నేర్చుకోవాలని తపన ఉంటుంది. ఒక డైరెక్టర్ గా ఇలాంటి కుర్రాడు మనకి దొరికితే ఉంటుంది అనిపిస్తుంది. అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది. తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు.
దీంతో మోక్షజ్ఞపై డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నందమూరి అభిమానులు ఈ కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ చేతిలో ప్రశాంత్ వర్మ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాలు ఉన్నాయి. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే మోక్షజ్ఞ చేతిలో మూడు సినిమాలు ఉండటం గమనార్హం.
Director @dirbobby garu about @MokshNandamuri 🔥🔥
6Feet,
Sharp Features,
Chala Grounded,
Hardwork,
And Oka director ga ee kurrodu manaki dorkithey untadi 🔥🔥#NandamuriBalakrishna #NandamuriMokshagna #DaakuMaharaaj#DaakuMaharaaj #NandamuriBalakrishna pic.twitter.com/2HkgKHE8Ld— manabalayya.com (@manabalayya) December 25, 2024
Also Read : MT Vasudevan Nair : సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు వాసుదేవన్ కన్నుమూత