Tollywood CM Meeting : సీఎంతో టాలీవుడ్ చర్చించే అంశాలు ఇవేనా? డ్రగ్స్ ఇష్యూ నుంచి గద్దర్ అవార్డులు, బన్నీ ఇష్యూ వరకు..
టాలీవుడ్ టాక్ ప్రకారం ప్రభుత్వం నుంచి, టాలీవుడ్ నుంచి ఉండే ప్రతిపాదనలు ఇవే అని తెలుస్తుంది..

Tollywood Meeting with CM Revanth Reddy will Discuss these Points Rumours goes Viral
Tollywood CM Meeting : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన అనంతరం నేడు సినీ పెద్దలు తెలంగాణ సీఎంని కలవబోతున్నారు. ఇప్పటికే సీఎం టాలీవుడ్ పై ఫైర్ అవ్వడంతో ఆయన్ని శాంతిపచేయడానికి, కొన్ని కీలక అంశాలపై చర్చించడానికి నేడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కాసేపట్లో కలవనున్నారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు ముందుండి ఈ మీటింగ్ ని నిర్వహిస్తున్నారు.
Also Read : Tollywood : నేడు తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం..
సీఎంతో మీటింగ్ కు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, సుప్రియ, చినబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్.. ఇలా పలువురు నిర్మాతలతో పాటు కొంతమంది హీరోలు, దర్శకుల సంఘం నుంచి వీర శంకర్, సాయి రాజేష్, వశిష్ట, హరీష్ శంకర్.. తో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు వెళ్లనున్నట్టు సమాచారం.
అటు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మీటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. అయితే ఈ మీటింగ్ లో ఏమేమి అంశాలపై చర్చించనున్నారో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ టాక్ ప్రకారం ప్రభుత్వం నుంచి, టాలీవుడ్ నుంచి ఉండే ప్రతిపాదనలు ఇవే అని తెలుస్తుంది..
ప్రభుత్వం నుంచి..
గద్దర్ అవార్డుల గురించి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు
సంధ్య థియేటర్ ఘటన
సంధ్య థియేటర్ ఘటనలో బాధపడిన కుటుంబం గురించి
డ్రగ్స్ నిర్ములనకు సహకారం
చిత్రపురి కాలనీ వివాదం..
టాలీవుడ్ నుంచి..
పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు గురించి
బెనిఫిట్, ప్రీమియర్ షోలు
రాబోయే పబ్లిక్ ఈవెంట్స్
అల్లు అర్జున్ గురించి
కొన్ని ఆర్ట్ సినిమాలకు రాయితీలు
సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న పలు సమస్యలు
ఈ అంశాలతో పాటు మరికొన్ని అంశాలు ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం టాలీవుడ్ విజ్ఞప్తులకు ఓకే చెప్తుందా? ప్రభుత్వం కండిషన్స్ కు టాలీవుడ్ ఓకే అంటుందా చూడాలి.
Also Read : MT Vasudevan Nair : సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు వాసుదేవన్ కన్నుమూత