Tollywood : నేడు తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు, టికెట్ ధరల పెంపుబెనిఫిట్ షోల రద్దు వంటి వాటిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ, చినబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ తదితరులు హాజరు కానున్నారు.
హీరోల నుంచి వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్, మా అసోసియేషన్ నుంచి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉంది.
Actress Divi : నటి ‘దివి’ కాలికి ఏమైంది.. కాలికి కట్టు వేసుకున్న ఫొటోలు షేర్ చేసి..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో జరగనున్న సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.