ఈసీ అధికారులను కలిసి దీనిపై ఫిర్యాదు చేశాం: పేర్ని నాని, మేరుగు నాగార్జున

YSRCP Leaders: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈశో ఆదేశాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు.

ఎన్నికల సంఘం అధికారులను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద పేర్ని నాని మాట్లాడుతూ… అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారని తెలిపారు.

గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని పేర్ని నాని అన్నారు. స్టాంప్ లేకపోయినా, చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని తెలిపారు. ఇప్పుడేమో కొత్తగా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని చెప్పారు.

ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని పేర్ని నాని అడిగారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదని చెప్పారు. ఒకవేల ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందని తెలిపారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ అలజడులు సృష్టించారని చెప్పారు. పేదలపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈశో ఆదేశాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు. వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలని అన్నారు.

Also Read: నా ఊపిరి ఉన్నంత వరకు అలా జరగనివ్వను: ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు