Attack On CM Jagan : సీఎం జగన్‌పై దాడి.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్

హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.

Attack On Cm Jagan With Stone

Attack On CM Jagan : విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జగన్ కి వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఇటువంటి దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు చేసి జగన్ ని ప్రతిపక్షాలు భయపెట్టలేవన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. దాడిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పోలీసులను కోరారు మంత్రి కారుమూరి. చంద్రబాబుకు ప్రజాదారణ కరవై పవన్ కల్యాణ్ ను వెంట తెచ్చుకుంటున్నా ప్రజలు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు.

విజయసాయిరెడ్డి..
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ఏనాడూ అభివృద్ధిని నమ్ముకుని రాజకీయాలు చేయలేదు. హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.

 

అంబటి రాంబాబు..
జగనన్నకు అయిన గాయం తెలుగు ప్రజలకు అయిన గాయం. జగన్ పై దాడి ప్రజల గుండెకు తగిలిన గాయం. చంద్రబాబు, పవన్ దీనికి బాధ్యత వహించాలి. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు. అధికారంలోకి రాలేమనే భయంతోనే టీడీపీ, జనసేన దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు ఇలా దాడులు చేయించారు. వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలి. ఈ ఘటనకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది.

హోంమంత్రి తానేటి వనిత..
విజయవాడలో సీఎం జగన్ పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించండి. రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు.

Also Read : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి.. కనుబొమ్మపై గాయం

ట్రెండింగ్ వార్తలు