Roja vs Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఫైర్…ఆయన రేవంత్ రెడ్డా? కోవర్డ్ రెడ్డా?

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, జగన్ మా ఇంట్లో మంతనాలు జరిపారనీ..వారిద్దరూ మా ఇంటికి ఎప్పుడొచ్చారో చెప్పాలని.. ఆయన రేవంత్ రెడ్డా?లేక కోవర్డ్ రెడ్డా చెప్పాలని ఈ సందర్భంగా రోజు సవాల్ విసిరారు.

Roja Revanth

Roja vs Revanth Reddy: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్ని నీటి వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నారా లోకేశ్ లపై కూడా రోజు విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డిపైనా ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ లు భేటీ అయ్యి మంతనాలు జరిపారనీ..రేవంత్ రెడ్డి అనవసరం ఆరోపణలు చేస్తున్నారని జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చారో అరోపణలు చేసిన రేవంత్ రెడ్డి నిరూపించాలని ఎమ్మెల్యే రోజా రేవంత్ కు సవాల్ విసిరారు.

కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఆ సమయంలో మా ఇంట్లో ఎటువంటి మంతనాలు జరగలేదని అన్నారు.రేవంత్ రెడ్డి పేరు కూడా ఈ సందర్భంగా రోజా మార్చేశారు. ఆమైదైన శైలిలో మాటలు విసురుతూ..‘ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డా’ ముందు ఆ విషయా చెప్పాలని మాటల తూటాలు పేల్చారు.

ఎల్లో మీడియాతో కలిస రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తుంటూ రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందని రోజా విరుచుకుపడ్డారు. టీడీపీకి కోవర్టు లాగా కాంగ్రెస్ లోకి వెళ్లారని..ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. పచ్చమీడియాతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందన్నారు. మీ నాయకుడు చంద్రబాబు 28 రకాల వంటకాలతో కేసీఆర్ కు దగ్గరుండి భోజనం తినిపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమే..తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదం పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కాబట్టి సీఎం జగన్ ప్రధాని మోదీకి..కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారని తెలిపారు. కేంద్ర ఈ జలవివాదంపై వెంటనే చొరవ తీసుకుని విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఉన్న వాటాను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.