Nara Lokesh
Yuva Galam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva galam padayatra) 150 రోజులు పూర్తిచేసుకుంది. 150వ రోజు అల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యాత్రకు స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అల్లూరులో టీడీపీ (TDP) శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగింది. యువగళం యాత్ర చేపట్టి 150 రోజులు పూర్తయిన సందర్భంగా లోకేశ్ తన సందేశాన్ని వెలువరించారు. నాలుగేళ్ల క్రితం జనం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన జగనోరా వైరస్ సోకిందని విమర్శించారు.
అభివృద్ధి లేదు, విధ్వంసం తీవ్రమైంది, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం దోపిడీ దొంగల తీరుగా మారిందంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారని అన్నారు. సైకో పాలకులపై ప్రజల్ని చైతన్యం చేయడానికి సరిగ్గా ఐదు నెలల క్రితం కుప్పంలో తొలి అడుగు వేశాను. నా యువగళం.. జనగళమైందని లోకేశ్ అన్నారు. యువత తమ భవితకోసం సైన్యమై నా వెంట నడుస్తున్నారు. ప్రజల కష్టాలు చూశాను. కన్నీళ్లు తుడిచానని అన్నారు. అడుగడుగునా అడ్డంకులు, సైకో సర్కారు వేధింపులను అధిగమించి యువగళం పాదయాత్రని జనం జైత్రయాత్ర చేశారని ప్రజలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
జనమే బలమై, బలగమై యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. యువగళం అప్రతిహత ప్రయాణంలో భాగమైన ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువగళం కమిటీలు, వలంటీర్లు, భద్రతాసిబ్బంది, మీడియాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమని పొందాను. మీ ఆప్యాయతని అందుకున్నాను. మీ ఆతిథ్యం స్వీకరించాను. మీ సమస్యలు పరిష్కరించి, అందరికీ అండగా నిలిచి రుణం తీర్చుకుంటాను అంటూ 150రోజులు పాదయాత్ర పూర్తిచేసుకున్న సందర్భంగా నారా లోకేశ్ తన సందేశంలో తెలిపారు.
యువగళం పాదయాత్ర 150వరోజు అల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను. అల్లూరులో భారీఎత్తున ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చి అపూర్వస్వాగతం పలికారు. అల్లూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజలు, వ్యాపారులు,… pic.twitter.com/VMoclIZq5X
— Lokesh Nara (@naralokesh) July 8, 2023