టార్గెట్ పవన్ కల్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యేకు సీఎం జగన్ కీలక సూచన

పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు.

Cm Jagan Target Pawan Kalyan

Pithapuram : వైసీపీ దూకుడు పెంచింది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతుండటంతో ఆయనను ఓడించేందుకు వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. పిఠాపురంను మరోసారి నిలబెట్టుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు. సీఎం జగన్ ను కలిశారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు సహకరించాలని దొరబాబుకు సూచించారు జగన్. నిన్న సీఎం జగన్ ను వంగా గీత కలిశారు.

”పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలని జగన్ చెప్పారు. తప్పకుండా వంగా గీతకు సపోర్ట్ చేస్తానని సీఎం జగన్ తో చెప్పాను” అని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు.

ఏపీ రాజకీయాల్లో పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయానికి వంగా గీత, ముద్రగడ పద్మనాభంను పిలిపించి మాట్లాడారు. గతంలో పిఠాపురం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది కనుక ఈసారి కూడా కచ్చితంగా పిఠాపురంలో వైసీపీ జెండా ఎగరాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనను ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి పిలించారు. ఎమ్మెల్యే దొరబాబు సీఎం జగన్ ని కలిసి వెళ్లారు. పిఠాపురంలో కచ్చితంగా వైసీపీ గెలుపొందాలని, పవన్ ను ఓడించాలని, అందుకు అనుగుణంగా పని చేయాలని ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా వంగా గీత ఉన్నారు కనుక, ఆమెను కచ్చితంగా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని దొరబాబుకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

చాలా కాలంగా పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఇంఛార్జ్ గా తనను తప్పించి వంగా గీతను నియమించడం పట్ల దొరబాబు అసంతృప్తిగా ఉన్నారు. వంగా గీతకు ఆయన సహకరించడం లేదు. దీనిపై వంగా గీత పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సైతం పిఠాపురం బాధ్యతలు అప్పగించారు జగన్.

అటు మాజీ మంత్రి కన్నబాబు, మంత్రి దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డిలకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు జగన్. కొన్ని మండలాలకు ఇంఛార్జ్ లు కూడా నియమించారు. ఇప్పుడు.. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిపించి నేరుగా ఆయనతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్.

Also Read : వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?- వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర

 

ట్రెండింగ్ వార్తలు