Horoscope Today in Telugu : రాశిఫలాలు 15 ఏప్రిల్ 2026.. ఈ రాశి విద్యార్థులు శుభవార్త వింటారు.. వారికి విశేష ధనయోగం..!
Daily Horoscope April 15 in Telugu: ఏప్రిల్ 15, బుధవారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. ఏ రాశి వారికి కలిసి వస్తుంది.. ఏ రాశుల వారు ఇబ్బంది పడతారు అంటే..
Horoscope Today 15 April 2026 wednesday Rasi Phalalu Telugu
Horoscope Today in Telugu 15 April 2026 : మన సమాజంలో రాశిఫలాలను నమ్మేవారు ఎంతమంది ఉన్నారో.. నమ్మని వారు కూడా అంతేమంది ఉంటారు. అయితే రాశిఫలాల్లో చెప్పినట్లే జరుగుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. కొందరికి ఇవి పూర్తిగా వర్తిస్తే.. మరికొందరికి కొంత మేర వర్తిస్తాయి. ఏది ఎలా ఉన్నా ఈ రోజు ఎలా ఉండబోతుంది అనే విషయం ముందుగానే తెలిస్తే.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ క్రమంలో బుధవారం, ఏప్రిల్ 15న 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
మేష రాశి:
బుధవారం, ఏప్రిల్ 15న మేష రాశికి చెందిన అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది, పాత మిత్రుల కలయిక వల్ల శుభవార్తలు వింటారని చెబుతున్నారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారు బుధవారం వృత్తి, ఉద్యోగాల్లో ముందంజలో ఉంటారు. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి బుధవారం నాడు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉదయం అంతా బాగానే ఉన్నా.. సాయంత్రం తర్వాత ఇబ్బందులు తలెత్తవచ్చంటున్నారు. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం అని సూచిస్తున్నారు.
కర్కాటక రాశి:
ఏప్రిల్ 15, బుధవారం నాడు కర్కాటక రాశి వారికి భిన్నంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అనిపించినా, ఇతరుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నారు.
సింహ రాశి:
బుధవారం సింహ రాశికి చెందిన రాజకీయ రంగం వారికి చాలా అనుకూలం అంటున్నారు. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారని తెలుపుతున్నారు.
కన్య రాశి:
ఏప్రిల్ 15న కన్యా రాశికి చెందిన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలుగుతాయని.. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు సహచరుల నుండి పూర్తి సహకారం అందుతుందంటున్నారు.
తులా రాశి:
బుధవారం నాడు తులా రాశికి చెందిన అన్ని వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి అంటున్నారు. శ్రమ అధికంగా ఉంటుంది. భూసంబంధిత వ్యవహారాల్లో కొంత ప్రతికూలత ఉండవచ్చని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి:
నేడు వృశ్చిక రాశి వారికి మానసిక ఆందోళనలు, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఆచి తూచి మాట్లాడటం మంచిదని సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి:
ఏప్రిల్ 15, బుధవారం ధనస్సు రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. మీ మాటకు విలువ పెరుగుతుంది, నేర్పరితనంతో పనులు సాధించుకుంటారని తెలుపుతున్నారు.
మకర రాశి:
బుధవారం ఏప్రిల్ 15 నాడు మకర రాశి వారికి అధిక ధన వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
కుంభ రాశి:
నేడు ఎటు చూసినా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు, విశేష ధనయోగం ఉందని పండితులు చెబుతున్నారు.
మీన రాశి:
బుధవారం మీన రాశికి చెందిన అన్ని రంగాల వారికీ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. పట్టుదలతో పని చేస్తేనే ఫలితం దక్కుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దంటున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
