Horoscope Today
Horoscope Today : నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు పరస్పరం కేంద్ర స్థితి సంతరించుకోవడం విశేష యోగంగా చెప్పాలి. వీటిలో వకృత్వం పొందిన బుధుడు, శుక్రుడు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. రవి, కుజుడు, చంద్రుడు, రాహువు, కేతువు ఇవాళ్టి రాశి ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి.
మనసు పెట్టి చేసిన పనులు ఈ రోజు దిగ్విజయంగా పూర్తవుతాయి. కష్టాన్ని నమ్ముకున్నవారికి గ్రహాల అనుగ్రహం అదృష్టమై తోడుగా నిలుస్తుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అన్న చందంగా ఉంటుంది.
Aries
మేషం: ప్రశాంతంగా ఉంటారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. భాగ్య చంద్రుడు అదృష్టాన్ని ఇస్తాడు. నాలుగు గ్రహాలు వ్యయంలో ఉన్నప్పటికీ.. ఊహించని మేలు పొందుతారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
Taurus
వృషభం: ప్రయాణంలో బడలిక ఉంటుంది. ఓపికకు పరీక్ష ఎదురవుతుంది. ఎదుటి వ్యక్తుల మాటల వల్ల మనసు చిన్నబుచ్చుకుంటుంది. సంయమనం పాటించడం అవసరం. పట్టువిడుపులు ప్రదర్శిస్తే.. మేలు జరుగుతుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Gemini
మిథునం: లగ్న కుజుడు ఆవేశానికి గురిచేస్తుంటాడు. అయితే, చంద్రుడి దృష్టి ప్రసన్నతను కలిగిస్తుంది. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మల్టిపుల్ అవకాశాలు తలుపు తడతాయి. ఇవి మంచి మార్పునకు దారి తీస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
Cancer
కర్కాటకం: మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులు పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రయోజనం చేకూరుతుంది. శివారాధనతో మేలు కలుగుతుంది.
Leo
సింహం: రవి మీకు అండగా ఉన్నాడు. చంద్రుడు సహకరిస్తున్నాడు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మనసు నిలుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
Virgo
కన్య: మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. కొత్త పనుల గురించి ఆలోచించకండి. చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం అవసరం. స్నేహితుల మద్దతు ఉంటుంది. రామాలయాన్ని సందర్శించండి.
Libra
తుల: మాట పట్టింపులు ఉంటాయి. పట్టువిడుపులు ప్రదర్శించడం చాలా అవసరం. అయిన వారిని దూరం చేసుకోకండి. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల అండదండలు ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
Scorpio
వృశ్చికం: ప్రశాంతంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకుంటారు. విజయం సాధిస్తారు. స్నేహితుల వల్ల కార్యసిద్ధి ఉంది. పెద్దల ఆశీస్సులు దండిగా పొందుతారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Sagittarisu
ధనుస్సు: కొత్త ఆశలు చిగురిస్తాయి. తల్లితరఫు బంధువులను కలుసుకుంటారు. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. వివాహ ప్రయత్నాలకు ఈ రోజు చాలామంచిది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. హనుమాన్ చాలీసా పఠించండి.
Capricorn
మకరం: కుటుంబంలో కలహ సూచన. సోదరులతో సఖ్యత చెడకుండా చూసుకోండి. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ప్రతికూల ఆలోచనలకు తావు ఇవ్వకండి. కుజుడి అనుగ్రహంతో ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ఆత్మవిశ్వాసంతో పనులు చేపడతారు. పెద్దలను కలుసుకుంటారు. వారి మనసు గెలుచుకుంటారు. భవిష్యత్ లక్ష్యాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
మీనం: మనసు ఒక్కదానిపై స్థిమితంగా ఉండదు. నాలుగు పనులు ఒకేసారి చేపట్టి.. దేన్నీ ముగించకుండా వదిలేస్తారు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. ఏదైనా క్షేత్రాన్ని సందర్శిస్తే మంచిది. వినాయకుడి ఆలయానికి వెళ్లండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.