Horoscope Today : ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి.

Horoscope Today

Horoscope Today : రాహువు, శని పరస్పరం చేరువయ్యే కొద్దీ.. కొన్ని రాశులకు ఈరోజు కష్టాలు తప్పవు. ఈ రెండు గ్రహాల యుతి మరికొన్ని రాశులకు అదృష్టాన్ని కట్టబెడుతుంది. కుంభం, మీనం ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభం, తుల రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది. కర్కాటకం, ధనుస్సు రాశులకు రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది.

Aries

మేషం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్లతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.

Taurus

వృషభం: సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. పెద్దల సహకారం అందుతుంది. దత్త స్తోత్రాలు పఠించండి.

Gemini

మిథునం: గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాలలో శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Cancer

కర్కాటకం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Leo

సింహం: ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. బంధువర్గంతో ఇబ్బందులు ఉంటాయి. భాగస్వాముల వల్ల వ్యాపారంలో చికాకులు తలెత్తుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Virgo

కన్య: ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Libra

తుల: గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఉద్యోగలుకు తాత్కాలిక అనుకూలత ఉంది. ఓపిక అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

Scorpio

వృశ్చికం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సూర్యారాధన శ్రేయస్కరం.

Sagittarius

ధనుస్సు: గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Capricorn

మకరం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

Aquarius

కుంభం: రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. బంధువర్గంతో వైరం ఏర్పడుతుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవాలి. రామాలయాన్ని సందర్శించండి.

Pisces

మీనం: ప్రయాణాల్లో పదనిసలు తప్పవు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మానసికంగా సంఘర్షణకు గురవుతారు. బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దక్షిణామూర్తిని ఆరాధించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.