Lakshmi Narayan Rajyog 2026 : అద్భుతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఇక ఈ 3 రాశుల వారి పంట పండింది.. వద్దన్నా డబ్బు.. కనక వర్షమే..!
Lakshmi Narayan Rajyog 2026 : మే నెలలో అరుదైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశులకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది.
- Dharani Pilli
- Updated on- April 26, 2026 / 06:59 PM IST
lakshmi narayan rajyog 2026 bring good luckfew zodiac signs due to venus mercury combine in gemini
Lakshmi Narayan Rajyog 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అప్పటి వరకు వారు ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. తాజాగా ఇలాంటి ఓ అరుదైన రాజయోగం ఏర్పడనుంది. శుక్ర, బుధ గ్రహాలు.. మిథున రాశిలో యుతి చెందడంతో అత్యంత అద్భుతమైన ‘‘లక్ష్మీ నారాయణ రాజయోగం’’ ఏర్పడబోతోంది. మే నెలాఖరులో మిథున రాశిలో ఈ గ్రహాల కలయిక వల్ల ఏర్పడబోయే ఈ లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని జ్యోతిష్య శాస్త్ర పండితులు.. అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది.
ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల ముఖ్యంగా మూడు రాశులు.. అనగా మిథున, తులా, కన్యా రాశుల్లో జన్మించిన వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ఈ యోగం ఏర్పడటం వల్ల వీరికి వృత్తిపరమైన ఎదుగుదల, కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఉల్లాసం పొందుతారు.
ఎప్పుడు ఏర్పడుతుంది
దృక్ పంచాంగం ప్రకారం, మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 29వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో యుతి చెందినప్పుడు ఈ అద్భుతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
మిథున రాశి:
లక్ష్మీ నారాయణ రాజయోగం మిథున రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి, ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు పొందవచ్చు. నిలిచిపోయిన బకాయిలు (Pending bills) వసూలు అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అయితే, ఈ సమయంలో మీలోని మితిమీరిన ఆత్మవిశ్వాసం తప్పుడు నిర్ణయాలకు దారితీయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కన్యా రాశి:
లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే వారిలో కన్యా రాశి వారు కూడా ఉన్నారు. వీరికి వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. అయితే ఇదే సమయంలో మానసిక ఒత్తిడి, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ గ్రహాల అద్భుత కలయిక భాగ్య స్థానమైన 9వ స్థానంలో జరుగుతోంది. దీనివల్ల వీరు విదేశీ సంబంధిత ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్, కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో పురోగతి బాగుంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. ఈ సమయంలో తులా రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనవసర విలాసాలకు దూరంగా ఉంటే మంచిది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
